Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి దిగుమతులపై ఆంక్షలు: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Follow Udayam on Google
Rohit Balakrishnan May 15, 2026 10:59 AM జాతీయంబిజినెస్
పసిడి దిగుమతులపై ఆంక్షలు: కేంద్రం కొత్త మార్గదర్శకాలు - Udayam
ఆభరణాల ఎగుమతుల కోసం ‘అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ స్కీం’ కింద సుంకం లేకుండా చేసుకునే ముడి బంగారం దిగుమతులపై కేంద్రం 100 కిలోల పరిమితి విధించింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి పరిమితులు లేకపోగా, తాజాగా గురువారం ఈ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పసిడిపై దిగుమతి సుంకాన్ని 6% నుండి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకుంది. తొలిసారి దరఖాస్తు చేసుకునే సంస్థల తయారీ కేంద్రాలను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేయడాన్ని తప్పనిసరి చేశారు.

Comments

G
Loading comments...