Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళామందిర్ కొత్త సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 12:32 PM జాతీయంబిజినెస్
కళామందిర్ కొత్త సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు - Udayam
ప్రముఖ రిటైల్ టెక్స్‌టైల్ సంస్థ సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు. గత కొన్నేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న ఆయన, కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భరద్వాజ్ గ్రూప్ ఈ-కామర్స్ విభాగం, వ్యాపార విస్తరణ, కంపెనీ ఐపీవో (IPO) ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారని సంస్థ ఫౌండర్, ఎండీ ప్రసాద్ చలవాడి తెలిపారు. ఆయన నాయకత్వంలో సంస్థ మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...