వార్తలకు తిరిగి వెళ్లండి

వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
పుష్కర ఘాట్ల అభివృద్ధి, భద్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. నీటి వనరులు, రోడ్లు, ఆరోగ్య శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Comments
Loading comments...

