వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మండలంలో ఈ నెల 5న జరగనున్న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌కు 96 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెంకట శివయ్య తెలిపారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 7న ఉదయం 8 గంటలకు సెయింట్ జాన్స్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. MPTC స్థానాలకు 59 మంది, ZPTC స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Comments
Loading comments...

