వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమ, శుక్రవారాల్లో కేసులను పూర్తిగా వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) విధానంలోనే విచారించనున్నారు. మిగిలిన మూడు రోజులు హైబ్రిడ్ పద్ధతి కొనసాగుతుంది.
దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్, న్యాయమూర్తులకు కార్ పూలింగ్ విధానాన్ని కూడా వర్తింపజేస్తున్నారు.
Comments
Loading comments...

