Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిల భవనాలపై దృష్టి సారించాలి

Follow Udayam on Google
Anjali Singh Jun 05, 2026 11:36 AM హైదరాబాద్General
శిథిల భవనాలపై దృష్టి సారించాలి - Udayam
సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన పట్టణ ప్రణాళికా విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌, నిర్మాణ అనుమతులు, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ప్రమాదకర సెల్లార్‌ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్‌లను వెంటనే గుర్తించి ప్రజల భద్రతకు భంగం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...