Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల వలకు చిక్కిన 'ఇలస' చేప.

Follow Udayam on Google
Priya Verma Jun 19, 2026 12:51 PM తూర్పుగోదావరి General
మత్స్యకారుల వలకు చిక్కిన 'ఇలస' చేప. - Udayam
రెండు నెలల విరామం తర్వాత సముద్రంలోకి వేటకు వెళ్లిన సఖినేటిపల్లి మత్స్యకారుల వలకు మొదటి రోజే 'ఇలస' చేప చిక్కింది. ఈ చేపను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో గురువారం వేలం వేయగా ఒకరు రూ.4,500కు కొనుగోలు చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఇదే చేప 'పులస'గా మారుతుందని, ఆ సమయంలో చిక్కితే రూ.30 వేలకు పైగా పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.

Comments

G
Loading comments...