Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఆందోళన

Follow Udayam on Google
Ravi Shukla Jun 03, 2026 11:28 AM సిద్దిపేటGeneral
ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఆందోళన - Udayam
సిద్దిపేట జిల్లా రామంచలో రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా కేంద్రాల్లో ధాన్యం పోసి ఎండల్లో ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యను పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని, వారితో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేశారు.

Comments

G
Loading comments...