వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ-20 ఇంధనంపై తప్పుడు ప్రచారం

ఇథనాల్ కలిపిన ఈ-20 పెట్రోల్‌ను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు వాదనలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
ఈ-20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల ఇంజన్లు పాడైనట్లు ఎక్కడా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, దీనిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.
Comments
Loading comments...