వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో నకిలీ నోట్ల సంఖ్య 20 శాతం పెరిగిందని ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏకంగా 1,41,907 నకిలీ నోట్లను గుర్తించారు. మరోవైపు మార్కెట్లో రూ.500 నోట్ల చలామణి గణనీయంగా పెరిగి, మొత్తం కరెన్సీ విలువలో వీటి వాటా 86 శాతానికి చేరింది.
ఇక చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లలో మార్చి నాటికి 98.45 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. కొత్త నోట్ల ముద్రణ తగ్గడం వల్ల ప్రభుత్వానికి కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.4,875 కోట్లకు తగ్గాయని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Loading comments...

