వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిరంతర విద్యుత్ అంతరాయంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమి, దోమల బెడదతో రోగులు, వారి బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ఇన్వెర్టర్ ఉన్నా సిబ్బంది వినియోగించడం లేదని ఆరోపిస్తున్నారు.
రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించి, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

