Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్‌ 2న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

Follow Udayam on Google
Ravi Shukla May 28, 2026 11:01 AM కరీంనగర్General
జూన్‌ 2న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం - Udayam
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసింది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్‌లలో సుమారు 1,660 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు పనులు తుది దశకు చేరుకున్నాయి. నిరుపేదలకు ఇళ్లు కేటాయించేలా అధికారులు సర్వే పూర్తి చేశారు. జూన్‌ రెండో తేదీన మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియ సాగుతోంది.

Comments

G
Loading comments...