వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న 'ఓం' చిత్రంపై అల్లు అర్జున్ 'పుష్ప' మార్క్ పడింది. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌తో విడుదలైన టైటిల్ గ్లింప్స్ చూసిన నెటిజన్లు, ఈ సినిమాను 'పుష్ప'తో పోలుస్తూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు.
ఈ పోలికలపై స్పందించిన దర్శకుడు, తాము కేవలం చిన్న సీన్ మాత్రమే చూపించామని, సినిమాలో మరెన్నో కొత్త అంశాలు ఉన్నాయని తెలిపారు. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం అక్టోబర్ 16న విడుదల కానుంది.
Comments
Loading comments...
