వార్తలకు తిరిగి వెళ్లండి

తమ భూమి సమస్యపై అధికారులు స్పందించడం లేదని ఆవేదన చెందుతూ కొండా పోచమ్మపల్లికి చెందిన దంపతులు బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

