Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ హెచ్చరిక

Follow Udayam on Google
Ravi Shukla Jun 05, 2026 4:00 PM హైదరాబాద్General
రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ హెచ్చరిక - Udayam
రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని, పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సమస్యను పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...