Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా బిలియనీర్‌కు అమెరికా కోర్టు జైలుశిక్ష

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 12:56 PM జాతీయంGeneral
చైనా బిలియనీర్‌కు అమెరికా కోర్టు జైలుశిక్ష - Udayam
ఆన్‌లైన్ ద్వారా బిలియన్ డాలర్ల మోసాలకు పాల్పడిన చైనా వ్యాపారవేత్త గువో వెంగుయికి అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తన ఫాలోవర్లను నమ్మించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. సేకరించిన నిధులతో గువో విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా, పలు క్రిప్టో స్కీమ్‌ల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశాడు. ఇతనిపై వచ్చిన 12 కేసుల్లో నేరం రుజువు కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...