వార్తలకు తిరిగి వెళ్లండి

రబీ వరి కొనుగోళ్లలో భాగంగా అన్‌లోడింగ్ హమాలీ ఛార్జీలను రూ.6.50 నుండి రూ.8.50కి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా వేగంగా మిల్లులకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో రైతులకు వెంటనే రశీదులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. లారీల కొరత ఉంటే ప్రత్యామ్నాయ వాహనాలను వాడాలని, కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

