Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు

Follow Udayam on Google
Rohit Singh Jun 01, 2026 3:33 PM అమరావతిGeneral
వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు - Udayam
నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తలేనని, ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీ మత విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని చంద్రబాబు విమర్శించారు. తాము డీఎస్సీ నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కేసులు వేసినా, పకడ్బందీగా పరీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...