Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులోకి దూసుకెళ్లిన లారీ - తృటిలో తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ వెళ్లే మార్గంలో శివసాగర్ చెరువు వద్ద లారీ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి పట్టణ సమీపంలోని చెరువులోకి దూసుకు వెళ్లడంతో డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించారు

Comments

G
Loading comments...