వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివారు దుండిగల్‌లో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని ఓ ర్యాపిడో బైక్ రైడర్ పోలీసులకు పట్టించాడు. మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు బుక్ చేసిన ఓ పార్సిల్‌పై అనుమానం వచ్చిన రైడర్ ఆదర్శన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఆ పార్సిల్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. దీంతో బీహార్‌కు చెందిన నిందితుడు రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ర్యాపిడో రైడర్‌ను డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.
Comments
Loading comments...

