వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ జస్వంత్ (36) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అతడు తన కుటుంబంతో కలిసి ఏపీలోని అన్నవరం వెళ్లి, కారులో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఐరన్ రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి జస్వంత్ భార్య, కూతురు, కుమారుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...

