వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పదేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై పోలీసులు నిర్వహించిన ప్రెస్‌మీట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంతటి దారుణమైన, తీవ్రమైన విషాద అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సీనియర్ పోలీస్ అధికారులు నవ్వుతూ, సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఘోర నేరంపై ప్రెస్‌మీట్ పెట్టి పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

