Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లోకి రావాలని ప్రవాస భారతీయులకు పిలుపు

Follow Udayam on Google
హరిక శర్మ Jun 24, 2026 12:29 PM జాతీయంGeneral
రాజకీయాల్లోకి రావాలని ప్రవాస భారతీయులకు పిలుపు - Udayam
భారత వ్యతిరేక విద్వేషపూరిత ఘటనలను ఎదుర్కోవడానికి ప్రవాస భారతీయులు రాజకీయాల్లో అడుగుపెట్టాలని యూఎస్‌ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉంటూ సమస్యలపై గళమెత్తాలని ఆయన సూచించారు. జాతి వివక్షను అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని స్థాయుల్లో పోటీ చేయాలని ఆయన ప్రోత్సహించారు. వలసదారులపై పెరుగుతున్న ద్వేషాన్ని ఎదుర్కోవడంలో భారతీయులంతా ఐక్యంగా ఉండాలని మరో సభ్యుడు థానేదార్ సూచించారు.

Comments

G
Loading comments...