Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వేషన్ల రద్దుకే బీజేపీ ఎత్తుగడ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 24, 2026 10:59 AM జాతీయంGeneral
రిజర్వేషన్ల రద్దుకే బీజేపీ ఎత్తుగడ - Udayam
లోక్‌సభలో ఎలాగైనా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలన్నదే బీజేపీ అసలు లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడానికే మోదీ ప్రభుత్వం ఈ వ్యూహాన్ని రచిస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను ముందుకు నెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిజమైన నిబద్ధత ప్రభుత్వానికి ఉంటే, ప్రస్తుత లోక్‌సభ స్థానాల బలంతోనే దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...