Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:00 AM సంగారెడ్డిGeneral
భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన - Udayam
కల్హేర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో కార్యక్రమంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం ఈ కార్యక్రమ లక్ష్యాలని తెలిపారు. మట్టి పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని, సేంద్రియ ఎరువులు వినియోగించాలని, పంట మార్పిడి పాటించాలని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్‌గా మార్చి నీటిని పొదుపు చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...