Back to feed
భారతీరాజా మరణం: మెగాస్టార్ చిరంజీవి నివాళి
Ritika Singh Jun 10, 2026 6:15 AM అల్ ఇండియా 21 views5 days ago

దర్శక శిఖరం భారతీరాజా మరణం చిత్రసీమకు తీరని లోటు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. 'ఆరాధన'లో పులిరాజుగా తనను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ గొప్ప దర్శకుడితో పనిచేయడం గొప్ప భాగ్యమని, ఆయన సింప్లిసిటీ తనపై చెరగని ముద్ర వేశాయని గుర్తుచేసుకున్నారు.
గ్రామీణ జీవనాన్ని వెండితెరపై కవిత్వంగా మలిచిన భారతీరాజా గొప్ప స్టోరీ టెల్లర్ అని కొనియాడారు. ఆయన సినిమాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని, భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Loading comments...



