వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పెట్టుబడుల సమీకరణ, ఆర్థిక సమగ్రత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకమని ఎస్‌బీఐ ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. 'డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్' వ్యూహంతో పాటు ఏఐ, సైబర్ భద్రత వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
భౌతిక బ్యాంకింగ్ శాఖల నమ్మకాన్ని, డిజిటల్ సేవల వేగంతో అనుసంధానించడమే తమ లక్ష్యమన్నారు. 'ప్రాజెక్ట్ సరళ్' ద్వారా రుణాల ప్రాసెసింగ్ వేగవంతం చేస్తూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

