వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి నిషేధం విధించింది. మే 31తో బదిలీల గడువు ముగియడంతో, జూన్ 1 నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం కోసం మినహాయింపులు తప్ప, సాధారణ బదిలీలకు అనుమతి లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘించి బదిలీలు చేస్తే సంబంధిత ఉద్యోగుల జీతాల బిల్లులు నిలిపివేయాలని ట్రెజరీ అధికారులను ఆదేశించారు. ఎవరైనా బదిలీలు చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. రాబోయే ఆరు నెలల పాటు బదిలీల ప్రతిపాదనలు స్వీకరించవద్దని అన్ని శాఖలను ప్రభుత్వం హెచ్చరించింది.
Comments
Loading comments...

