వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బసవేశ్వర విగ్రహం సమీప బైపాస్ ఓవర్ బ్రిడ్జి కింద పది రోజులుగా మురుగునీరు పారుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ సిబ్బంది సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

