Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
సందీప్ Jul 13, 2026 7:43 PM నిర్మల్ General
బాసర రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు - Udayam
రాత్రి సమయంలో రైళ్లలో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో బాసర రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో కలిసి ప్లాట్‌ఫారాలు, ట్రాక్‌లు, ప్రయాణికుల నిరీక్షణ గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ సైదయ్య సూచించారు.

Comments

G
Loading comments...