వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణైన రోహిత (13) అవయవదానంతో ఆరుగురికి ప్రయోజనం చేకూరింది. కూకట్‌పల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న రోహిత ప్రయాణిస్తున్న ఆటోను గత నెల 20న బాలానగర్ వద్ద లారీ ఢీకొట్టింది.
కుటుంబసభ్యుల అంగీకారంతో రెండు కిడ్నీలు, కాలేయాన్ని నలుగురికి అమర్చారు. కంటి కార్నియాలను మరో ఇద్దరికి అమర్చినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

