వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులపై దాడికి దిగిన దొంగలను పోలీసులు అడ్డుకున్నారు. రైలు నిద్రిస్తున్న వారి వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించగా, అప్రమత్తమైన ప్రయాణికులు గట్టిగా కేకలు వేస్తూ వారిని ప్రతిఘటించారు.
దీంతో రైలు చైన్ లాగి దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించగా, రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. చీకటిని ఆసరాగా చేసుకుని దుండగులు తప్పించుకున్నారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

