వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దుండగులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాధితుడు పాట్నాలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదు అందిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు.
Comments
Loading comments...

