వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు సభ్యురాలిగా చోటు కల్పించడం విశేషం.
ఈ కమిషన్ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతుంది. మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

