వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడవచ్చు.
ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో గరిష్ఠంగా కావలిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భీమిలిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

