Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Vikram Singh Jun 03, 2026 12:57 PM తిరుపతిGeneral
అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత - Udayam
తిరుమల అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించడంపై నిరసన తెలుపుతుండగా, పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. కూటమి నేతల ఒత్తిడితో వ్యాపారులను తొలగించడం అప్రజాస్వామికమని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ, వ్యాపారులకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...