వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని నాగోల్, కొండాపూర్, మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్‌లైన్ ఫీజుకు అదనంగా వసూళ్లు జరుగుతున్నట్లు గుర్తించి, పెద్ద సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలను స్వాధీనం చేసుకున్నారు. దళారుల ప్రమేయంతో జరుగుతున్న ఈ అవకతవకలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఈ తనిఖీల్లో నాగోల్ కార్యాలయం వద్ద ఏజెంట్ల నుంచి రూ. 2.41 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ స్కూల్ యజమాని వద్ద 184 లైసెన్స్‌లు బయటపడటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

