వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న ఏకైక అనధికార టెస్టులో భారత్ తొలి రోజు 9 వికెట్లకు 351 పరుగులు చేసింది. తనీషా సింగ్ (92), శుభ సతీశ్ (59), నికి ప్రసాద్ (78 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో రాణించారు. ఓపెనర్లు శుభ, ప్రియ పూనియా (46) తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు.
18 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తనీషా, అనుష్క శర్మ (44) ఆదుకున్నారు.
Comments
Loading comments...

