వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంట మండలం రైతు భరోసా కేంద్రాల్లో మంగళవారం నుంచి రాయితీ విత్తనాల పంపిణీ మొదలైంది. వర్షాల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా 180 హెక్టార్లకు సరిపడా జనుము, ఉలవలు, రాగుల విత్తనాలను 80% సబ్సిడీతో అందిస్తున్నారు.
ఎకరానికి 10 కేజీల ఉలవల విత్తనాలు కేవలం రూ.150కే లభిస్తాయి. స్వల్పకాలిక పంటలతో రైతులు రూ.25 వేల దాకా ఆదాయం పొందవచ్చని, స్టాక్ సరిపడా ఉందని AO చిరంజీవి తెలిపారు.
Comments
Loading comments...

