వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీనివాస్ అనే నేతకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండున్నరేళ్లుగా ఉపాధి లేక, అప్పుల భారం పెరగడంతో రసాయన మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్యం, పేదరికం ఆయనను తీవ్రంగా కృంగదీశాయి.
శ్రీనివాస్ మరణంతో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేతన్నల వరుస మరణాలు స్థానికంగా తీవ్ర ఆందోళనను, కలకలాన్ని రేపుతున్నాయి.
Comments
Loading comments...

