వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 40.2 డిగ్రీలకు చేరుకోవడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌కు ఉపశమనం లభించింది.
మారేడ్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తాజాగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...
