వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా నాచారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం హల్దీ వాగులో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చొప్పున ఈత రాక ముగ్గురూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మృతులను నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్, వికాస్, ఆనంద్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఒక్క క్షణం అజాగ్రత్త ఆ మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
Comments
Loading comments...

