Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల నిరసన సెగ: సమస్యలపై నివేదికలకు ప్రభుత్వ ఆదేశం!

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 12:17 PM హైదరాబాద్General
ఉద్యోగుల నిరసన సెగ: సమస్యలపై నివేదికలకు ప్రభుత్వ ఆదేశం! - Udayam
ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పీఆర్సీ, డీఏ, హెల్త్ స్కీమ్ వంటి అంశాలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అన్ని శాఖలకు జీఏడీ ఆదేశించింది. మే 1లోగా నివేదికలు అందజేయాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 5న ఉద్యోగ సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కసరత్తు కీలకంగా మారింది. నివేదికలను పరిశీలించి, కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...