Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆర్టీసీ మరో సకల జనుల సమ్మె: ప్రభుత్వంపై జేఏసీ తీవ్ర ఆగ్రహం!

Udayam Digital Staff Apr 21, 2026 8:54 AM హైదరాబాద్ 8 views18 days ago
ఆర్టీసీ మరో సకల జనుల సమ్మె: ప్రభుత్వంపై జేఏసీ తీవ్ర ఆగ్రహం! - Udayam Digital
విలీన ప్రక్రియపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, చర్చలకు రావడం లేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంలో అలసత్వం, ఆస్తుల ప్రైవేటీకరణపై నిరసనగా ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతున్నామని తెలిపారు. నోటీసు ఇచ్చి 41 రోజులు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో సహా అంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటుపరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఈ ఆందోళన ‘సకల జనుల సమ్మె’గా మారుతుందని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...