Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వరుస భూకంపాలతో ప్రజల బెంబేలు!

Udayam Digital Staff Apr 21, 2026 7:23 AM అల్ ఇండియా 8 views18 days ago
వరుస భూకంపాలతో ప్రజల బెంబేలు! - Udayam Digital
ఈశాన్య భారతాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఇవాళ ఉదయం మణిపూర్‌లోని కామ్‌జాంగ్‌ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూమి కంపించింది. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి చూసి అందరూ అయోమయంలో మునిగిపోయారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇది రెండోసారి భూమి కంపించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడు ఈ వరుస ప్రకంపనలు కలవరపెడుతున్నాయి.

Comments

G
Loading comments...