వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జీఎస్టీ విభాగంలో లాటరీ ఆధారిత పోస్టింగ్ విధానాన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న సిఫార్సుల సంస్కృతికి స్వస్తి పలికి, 87 మంది అధికారులకు బహిరంగంగా లాటరీ తీయడం ద్వారా వార్డులను కేటాయించారు. ఉన్నతాధికారుల సమక్షంలో, పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ప్రక్రియ పాలనా వ్యవస్థలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని సీఎం కార్యాలయం (CMO) పేర్కొంది. నిష్పక్షపాతంగా జరిగిన ఈ కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

