వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులతో పాటు మరో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జిల్లా భోజ్ ఆసుపత్రి వైద్యులు ఛత్రపాల్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులకు ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

