Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు; బాంబు పేలుళ్ల కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణ.

Udayam Digital Staff Apr 17, 2026 6:26 AM అల్ ఇండియా 11 views22 days ago
బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు; బాంబు పేలుళ్ల కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణ. - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుళ్లకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌ఐఏను అడ్డం పెట్టుకుని అల్లర్లు సృష్టించి, ఆ నిందను ఇతరులపై వేయాలని చూస్తున్నారని ఎన్నికల ప్రచార సభలో ఆమె విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బయటి వ్యక్తులతో అశాంతి కలిగించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మమత సూచించారు. అల్లర్ల ద్వారా ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, యువతను అరెస్టు చేయించే కుట్రలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...