Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నిప్పులు చెరుగుతున్న ఎండలు.. తెలంగాణలో సెగలు కక్కుతున్న ఉష్ణోగ్రతలు!

Udayam Digital Staff Apr 18, 2026 5:52 AM హైదరాబాద్ 15 views21 days ago
నిప్పులు చెరుగుతున్న ఎండలు.. తెలంగాణలో సెగలు కక్కుతున్న ఉష్ణోగ్రతలు! - Udayam Digital
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాల్లో వడగాలులు వీచాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు మరో ఒకటి నుండి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...