వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో సుమారు 20 కీలక అంశాలకు ఆమోదం లభించింది. మున్సిపల్ ఆస్తుల లీజు నిబంధనల సవరణతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన మ్యుటేషన్ ఛార్జీలను అమలు చేసే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పోలీసు శాఖలో 385 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, న్యాయస్థానాల్లో 21 కొత్త పోస్టుల సృష్టికి మంత్రివర్గం అంగీకరించింది. నిరుద్యోగులకు మేలు చేసేలా పలు ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోద ముద్ర వేశారు.
Comments
Loading comments...

